నాగలి నెట్టి నేలను దున్ని, మా పేగులకి పట్టెడు అన్నం బెట్టి ఆకలి తీర్చే నీవు
మా అందరికీ అన్నవు, అన్నపూర్ణాదేవికే నాన్నవు, ఈ దేశానికే వెన్నువు!
మా కుటుంబాలకు ఆకలి బాధ లేకుండా చేసిన నీకు
మేము సరైన న్యాయం చేయలేకపోతున్నాం...
అయినా మాకోసం శ్రమిస్తూనే ఉంటావు.
ఎంతైనా విశాలమైన భూమాతతో సావాసం కదా,
అదే విశాలమైన మనసు నీకూ వచ్చింది!
మా మేలు కోరుకునే మీరు
మీ వేలు పట్టుకుని ఎదిగిన పచ్చని చేలు,
ఇలాగే వర్ధిల్లాలి నూరేళ్లు!
- మీ హేమంత్ కారిచర్ల
చాలా బాగా చెప్పారు.. 👌