27 March, 2023
Maguva Teguva Book Teaser
చెప్పాలంటే బాధగా, ఇబ్బందిగా, సిగ్గుగా ఉన్నా... మన దేశంలోని ఆడవాళ్ళ మీద ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న అకృత్యాలను చూసి, ఆవేదన చెంది, సరిగ్గా రెండేళ్ల క్రితం 'Maa', 'Swecha' అను రెండు పుస్తకాలు రాసాను. ఓ విషయాన్ని నేరుగా చెబితే ఎవరూ వినరు కాబట్టి.. మనకి తెలిసిన కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారం చేసుకుని, ఆ వాస్తవికతకు ఏ మాత్రం భంగం కలగకుండా, ఉన్న పరిధి మేరకు కాస్త కాల్పనికతను జోడించి ఓ కథగా మలిచి, సమస్యను, సమస్యలో తీవ్రతను, వారి బాధను, ఆవేదనను కథలో ప్రతిబింబించేలా రాయటంతో పాటు, ఆ సమస్యకు కొన్ని పరిష్కార మార్గాలు కూడా చెప్పడం జరిగింది.
ఇప్పుడు అదే కథను మన మాతృభాషైన తెలుగులో, చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి, మాతృభాషలో ఉండే సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని, మరింత బలంగా 'మగువ తెగువ' అనే పేరుతో రాయడం జరిగింది!
వేరే కథల్లా ఇది కేవలం వినోదం కోసం రాసింది కాదు. ఒక సత్ప్రయోజనం కోసం రాసిన కథ. కాబట్టి, దీన్ని అందరికీ చేరవేసే బాధ్యతని నిర్వర్తించే పనిలో భాగంగా మీ సాయం కోరుతున్నాను!
మీరు చేయాల్సిందల్లా 'మగువ తెగువ' పుస్తకం గురించి మీ సాంఘిక మాధ్యమాలలో షేర్ చేయడమే! ఎక్కువ మందికి చేరాలంటే నా ఒక్కడి వల్ల కాదు కనుక మీ సాయం కోరుతున్నాను!
కాబట్టి, మీకు నేను చెప్పింది గాని, అడిగింది గాని సబబు అనిపిస్తే 'మగువ తెగువ' శబ్దాన్ని అందరికీ వినిపించేలా చేసే ప్రయత్నంలో మీరూ భాగం అవుతారాని ఆశిస్తున్నాను! - మీ హేమంత్
ఈ పుస్తకాన్ని ఈ లింక్ ద్వారా కొనుగోలు చేయచ్చు! - https://hemanthstories.com/b/maguva-teguva